విజయవాడ సీపీ కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో ఓ పెళ్లి విందుకు హాజరయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కుమార్తె పావని మనోజ్ఞ పెళ్లి రిసెప్షన్ ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ వధూవరులు పావని మనోజ్ఞ-ప్రనీష్ సాయిలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ వివాహ రిసెప్షన్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు.

CM Jagan
Wedding Reception
Bathina Srinivasulu
Police Commissioner
Vijayawada

More Telugu News